సెరో సర్వే : థర్డ్ వేవ్‌పై ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శక్తి ఉందని సెరోసర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు. వైరస్ స్వభావం ఎలా మారుతుందనేది మనం అంచనా వేయలేమని..అయితే రాబోయే నెలల్లో అది అనూహ్యంగా పరివర్తన చెందేలా కనిపించడం లేదని అన్నారు.
సెరో సర్వే ప్రకారం దేశ జనాభాలో ఎక్కువ మందికి రోగనిరోధకత ప్రబలంగా ఉందని వెల్లడైందని చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలు విధిగా కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని డాక్టర్ గులేరియా విజ్ఞప్తి చేశారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ రాబోయే నెలల్లో మనం జనసమ్మర్ధ ప్రాంతాల్లోకి వెళ్లకుండా, ప్రమాణాలకు దూరంగా ఉండటం వంటి నిబంధనలను పాటించాలని సూచించారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం థర్డ్ వేవ్ తలెత్తకుండా జాప్యం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే దాన్ని తీవ్రతరం కాకుండా పరిమితం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన తాజా సెరో సర్వేలో ఆరేండ్లు పైబడిన జనాభాలో 67.6 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు తయారయ్యాయని వెల్లడైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

