Ayodhya | అయోధ్యలో డ్రెయిన్లు, రోడ్లు శుభ్రం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారు. మురికి కాలువల నుంచి వ్యర్థాలను తొలగించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో సన్నాహక కార్యక్రమాలు చేపట్టారు. అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు క్లీన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య నాలుగు రోజులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు ఆయన శుభ్రం చేశారు. మురికి కాలువల నుంచి వ్యర్థాలను తొలగించారు. వీధుల్లోని చెత్తను ఎత్తి క్లీన్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా గురువారం అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మరోవైపు ప్రధాని మోదీ డిసెంబర్ 30న అయోధ్యను సందర్శిస్తారు. ఇక్కడ నిర్మించిన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే జనవరి 22న జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరవుతారు.
अयोध्या: UP के डिप्टी CM केशव प्रसाद मौर्य ने स्वच्छता अभियान में हिस्सा लिया
श्रीराम मंदिर में प्राण प्रतिष्ठा समारोह से पहले अयोध्या में की साफ–सफाई 22 जनवरी को नए राम मंदिर में होगा प्राण प्रतिष्ठा समारोह। #Ayodhya #AyodhyaRamTemple #DYCM #KeshavPrasadMaurya #Cleanliness… pic.twitter.com/RrQJ2q4Cqq
— Deshhit News (@deshhit_news) December 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

