లక్నో: ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, మహిళా సహోద్యోగిని ఇంట్లో ఉండగా అతడి భార్య, ఆమె బంధువులు కలిసి
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. (cop caught red handed with female colleague) ఇద్దరిని బయటకు ఈడ్చుకొచ్చి చితక బాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, లేడీ ఇన్స్పెక్టర్ కలిసి తొలుత నోయిడాలో పనిచేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో తరచుగా వారిద్దరూ కలుసుకుంటున్నారు.
కాగా, ముజఫర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా మగ ఇన్స్పెక్టర్ ఉన్నారు. లేడీ ఇన్స్పెక్టర్ శైలి రానా రకబ్గంజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది. ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న క్వాటర్స్‌లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నది. అయితే మగ ఇన్స్పెక్టర్ ఆమె ఇంట్లో ఉన్నట్లు అతడి భార్యకు తెలిసింది. దీంతో కుమారుడు, బంధువులతో కలిసి అక్కడకు చేరుకుంది. వారిద్దరూ బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో ఇంటి తలుపులు పగులగొట్టారు. ఇద్దరిని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్కు బదిలీ అయిన తన భర్త, ప్రియురాలితో కలిసి ఉండేందుకు ఆగ్రా వచ్చాడని అతడి భార్య ఆరోపించింది.
మరోవైపు ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించకుండా పోలీసులు వీడియో తీయడంపై ఆగ్రా పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు సబ్-ఇన్స్పెక్టర్లతో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
आगरा की घटना
एक महिला पुलिस इंस्पेक्टर के घर पर एक पुरूष पुलिस इंस्पेक्टर बार-बार आते थे
इंस्पेक्टर साहब की पत्नी को भनक लग गई थी
उसके बाद इंस्पेक्टर साहब की पत्नी ने दोनों को रंगे हाथ पकड़ा और दोनों की खूब धुनाई हुई pic.twitter.com/Eaul4Bbu9P
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) August 3, 2024