Viral | పెళ్లికొడుకు మాటిమాటికి గదిలోకి వస్తున్నాడని మ్యారేజి క్యాన్సిల్ చేసిన వధువు
మిగతా పెళ్లి ఆచారాలు జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె పట్ల పెళ్లికుమారుడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు.
Viral | : వధువు అందానికి ఆకర్షితుడైన వరుడు పెళ్లి తంతు పూర్తికాక ముందే పలుసార్లు ఆమె గదిలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణ వల్ల ఆ పెళ్లి రద్దైంది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక జంటకు పెళ్లి నిశ్చయమైంది. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. వధువరులిద్దరూ పెళ్లి దండలు మార్చుకున్నారు. మిగతా పెళ్లి ఆచారాలు జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె పట్ల పెళ్లికుమారుడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు.
కాగా, ఇది చూసిన వరుడి తండ్రి అలా చేయవద్దని చెప్పాడు. అయినప్పటికీ పెళ్లికుమారుడు లెక్క చేయలేదు. వధువు గదిలోకి వెళ్లసాగాడు. దీంతో ఆగ్రహం పట్టలేని తండ్రి అందరి ముందు కుమారుడి చెంపపై కొట్టాడు. అయితే వరుడు కూడా తిరిగి తన తండ్రి చెంపపై కొట్టాడు. ఇది చూసిన బంధువులు, వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో వరుడితో తాళి కట్టించుకునేందుకు వధువు నిరాకరించింది. అతడితో పెళ్లిని రద్దు చేయాలని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లిని రద్దు చేయాలని వధువరుల కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో వరుడి కుటుంబం, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

