భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి.. స్పందించి అంబులెన్స్ ఏర్పాటు చేసిన పోలీసులు
రోడ్డుపై వెళ్లే వారు దీనిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. అతడికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
అమరావతి: అనారోగ్యంతో చనిపోయిన భార్య మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక ఒక వ్యక్తి తన భుజంపై కొంతదూరం మోశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించి అతడికి సహాయం చేశారు. సొంత డబ్బుతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన ఈడే సాములు భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్చాడు. అయితే చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
కాగా, సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని సోరాడ గ్రామానికి భార్యను తీసుకెళ్లేందుకు సాములు రెండు వేలకు ఆటో మాట్లాడుకున్నాడు. అయితే విజయనగరం చేరుకునేసరికి అతడి భార్య ఆటోలోనే మరణించింది. దీంతో సాములతోపాటు అతడి భార్య మృతదేహాన్ని వారి గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో సాములు తన భార్య మృతదేహాన్ని కొంతదూరం భుజంపై మోశాడు.

మరోవైపు రోడ్డుపై వెళ్లే వారు దీనిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. సీఐ తిరుపతిరావు, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు కలిసి పదివేలు సమకూర్చి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో చనిపోయిన భార్య మృతదేహాన్ని సాములు తన గ్రామానికి తీసుకెళ్లాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Carries
- odisha man
- Wife's Body
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

