ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. దాంట్లో తుంపర్లు మొదటిది. వైరస్ సంక్రమించిన వ్యక్తి.. తుమ్మినా.. దగ్గినా.. ఆ తుంపర్లు సుమారు రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇక రెండవది ఏరోసోల్స్. ఏరోసోల్స్ అంటే అతిసూక్ష్మ తుంపర్లు. ఈ ఏరోసోల్స్ గాలిలో సుమారు పది మీటర్లు ప్రయాణిస్తాయని ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు తన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. పాజిటివ్ వ్యక్తి నుంచి రిలీజైన తుంపర్లు ఏదైనా వస్తువుపై పడినా.. ఆ సర్ఫేస్పై వైరస్ సజీవంగా కొంత సమయం ఉంటుంది. ఇది మూడవ మార్గం.
అయితే పెద్ద సైజులో ఉండే తుంపర్లు సాధారణంగా .. కింద పడిపోతాయి. కానీ చిన్న సైజులో ఉండే ఏరోసోల్స్ మాత్రం చాలా దూరమే ప్రయాణిస్తాయి. అవి కనీసం పది మీటర్ల దూరం ప్రయాణిస్తాయని ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్ స్పష్టం చేశారు. దీని వల్ల ఎక్కువ శాతం వైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఒకవేళ మీరు ఇండోర్ స్పేస్‌లో ఉన్నట్లు అయితే ఆ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే చాలా త్వరగా ఆ ప్రాంతాల్లో వైరస్ లోడ్ అధికం అవుతుంది. దీని వల్ల వ్యాప్తి కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఔట్‌డోర్ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉంటుందని, ఎందుకంటే వైరస్ కణాలు చాలా త్వరగా గాలి ద్వారా కొట్టుకుపోతాయని అడ్వైజరీ చెప్పింది.
సర్ఫేస్ ట్రాన్స్మిషన్..
వైరస్ సంక్రమిత వ్యక్తి నుంచి వెలుబడిన తుంపర్లు వేర్వేరు ప్రదేశాల్లో.. వేర్వేరు వస్తువులపై పడుతుంటాయి. అయితే కలుషితమైన ఆ ప్రదేశాలను ఎవరైనా ముట్టుకుని.. చేతులను శానిటైజ్ చేసుకోకుండా.. నోట్లో కానీ, కంట్లో కానీ, ముక్కులో కానీ పెట్టుకుంటే, దాని ద్వారా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లాస్, ప్లాస్టిక్, స్టీల్ లాంటి వస్తువులపై.. వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని సైంటిఫిక్ అడ్వైజరీ పేర్కొన్నది. డోర్ హ్యాండిళ్లు, లైట్ స్విచ్‌లు, టేబుళ్లు, చైర్లు, ఫ్లోర్‌ను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలన్నది. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటి వాటిని కూడా క్లీనింగ్ కోసం వాడవచ్చు. సరైన వెంటిలేషన్ ఉంటే.. ఈ సమస్యలన్నీ తప్పించుకోవచ్చు అని సైంటిఫిక్ అడ్వైజరీ ఆఫీసు తన మార్గదర్శకాల్లో చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

