Watch: గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఎగిరిన పెద్ద బ్రా.. వీడియో వైరల్
Flying Bra | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద పెద్ద బ్రా గాలిలోకి ఎగిరింది. (Flying Bra) బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన యాడ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద పెద్ద బ్రా గాలిలోకి ఎగిరింది. (Flying Bra) బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన యాడ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లోదుస్తుల బ్రాండ్ అయిన వాకోల్ ఇటీవల సీజీఐ ట్రెండ్‌ని వినియోగించి పబ్లిక్ స్టంట్ ఏర్పాటు చేసింది. పింక్ కలర్లో ఉన్న పెద్ద సైజు బ్రాను డ్రోన్ల సహాయంతో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఎగురవేసింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం ఎగురవేసిన పెద్ద బ్రా ఆ సమయంలో అక్కడ ఉన్న సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నది.
కాగా, లోదుస్తుల బ్రాండ్ వాకోల్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘అందరి హృదయాలకు దగ్గరగా ఉండే లక్ష్యం కోసం మేం కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాం’ అన్న శీర్షికతో దీనిని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా దీనికి బాగా స్పందించారు. లోదుస్తుల కంపెనీ వినూత్న యాడ్‌కు ఫిదా అయ్యారు.
మరోవైపు వాకోల్ మాదిరిగానే అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ అలెగ్జాండర్ వాంగ్ కూడా తన ఉత్పత్తిని మాన్‌హట్టన్ బ్రిడ్జ్ మీదుగా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో గాలిలో వేలాడినట్లుగా ఉన్న భారీ బ్రా వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

