Sayaji Shinde | చెట్లను నరికి నాసిక్ వాసులను ఎగతాళి చేయొద్దు : నటుడు సయాజీ షిండే
Sayaji Shinde | మహారాష్ట్ర (Maharastra) ప్రభుత్వ నిర్ణయంపై నటుడు సయాజీ షిండే (Sayaji Shinde) విమర్శలు గుప్పించారు. కుంభమేళా కోసం ఆ రాష్ట్రంలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో వేలాది చెట్ల నరికివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Sayaji Shinde : మహారాష్ట్ర (Maharastra) ప్రభుత్వ నిర్ణయంపై నటుడు సయాజీ షిండే (Sayaji Shinde) విమర్శలు గుప్పించారు. కుంభమేళా కోసం ఆ రాష్ట్రంలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో వేలాది చెట్ల నరికివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సయాజీ షిండే తప్పుపట్టారు. చెట్లను నరికేసి నాసిక్ ప్రజలను ఎగతాళి చేయవద్దని కుంభమేళా మంత్రి గిరీశ్ మహాజన్ (Girish Mahajan) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది కుంభమేళా నాటికి పంచవటి, తపోవనాల్లో సాధువుల కోసం వసతిగృహాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పనుల కోసం రూ.220 కోట్ల విలువైన టెండర్లను పిలిపించి, అక్కడున్న మొత్తం 35 ఎకరాల్లోని 1,825 చెట్లను నరికివేయాలని తీర్మానించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 8 రోజులుగా పర్యావరణవేత్తల నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ ఆందోళనలో భాగంగా శనివారం పర్యావరణవేత్త, నటుడు సయాజీ షిండే కూడా తపోవనాన్ని సందర్శించి చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. చెట్లను నరకాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

