Raghava Lawrence | ప్రజల కోరిక మేరకే రాజకీయాల్లోకి వస్తున్నా : రాఘవ లారెన్స్
Raghava Lawrence | ప్రముఖ కొరియోగ్రాఫర్ (Choreographer), నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. ప్రజలు, అభిమానుల నుంచి లభించిన విశేష మద్దతుతో రాజకీయ అరంగేట్రంపై తాను సానుకూల నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టంచేశారు.
Raghava Lawrence : ప్రముఖ కొరియోగ్రాఫర్ (Choreographer), నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. ప్రజలు, అభిమానుల నుంచి లభించిన విశేష మద్దతుతో రాజకీయ అరంగేట్రంపై తాను సానుకూల నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టంచేశారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి ప్రకటన వెలువరించనున్నట్లు తెలిపారు. చెన్నై (Chennai) లోని తన నివాసంలో అభిమానులతో సమావేశమైన అనంతరం లారెన్స్ మీడియాతో మాట్లాడారు.
‘అనేకమంది నన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ప్రజలే నన్ను ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉంది. అందుకే ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నా’ అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. త్వరలోనే తన తల్లి, మద్దతుదారులతో భారీ సమావేశం నిర్వహించి తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్.. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ తరఫున లారెన్స్ పోటీ చేస్తారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గతంలో లారెన్స్ ఒక వీడియో సందేశం ద్వారా తన సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై ప్రజల అభిప్రాయం కోరారు. దానికి విశేష స్పందన లభించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాలలు, దేవాలయాల సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేయాలన్న టీవీకే విధానాలను రాఘవ లారెన్స్ ప్రశంసించారు. దాంతో ఆయన విజయ్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పార్టీ సభ్యత్వం, పోటీ చేసే స్థానంపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

