Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Abhijeet Dipke : సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేకు ఢిల్లీకి చెందిన కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, పీస్ బాండ్ మీద సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.
Abhijeet Dipke : సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేకు ఢిల్లీకి చెందిన కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, పీస్ బాండ్ మీద సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. దీప్కేను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్ వద్ద శుక్రవారం లెహ్రా దో తిరంగా పేరుతో ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే, ఈ ర్యాలీకి వెళ్లకుండా దీప్కేను పోలీసులు అడ్డుకున్నారు.
ఉద్రిక్తత తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం సాయంత్రం దీప్కేను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఝండేవాలన్ నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, గత అక్టోబర్ 10న ఇచ్చిన బెయిల్ కండీషన్ ఉల్లంఘించినందుకుగాను అతడిని అరెస్టు చేశారు. దీప్కే అరెస్టును సవాలు చేస్తూ సీజేపీ న్యాయవాది రత్నా సింగ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ను శనివారం ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గతంలో చెప్పినట్లు శాంతికి సహకరించాలని కోర్టు సూచించింది. దీని ప్రకారం పీస్ బాండ్‌పై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.
అలాగే, రూ.50,000 సెక్యూరిటీ బాండ్ కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పీస్ బాండ్‌పై సంతకం చేయడంతోపాటు, సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించిన అనంతరం దీప్కే విడుదలవుతారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు లెహ్రా దో తిరంగా సందర్భంగా అరెస్టు చేసిన ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరాను కూడా శనివారం పోలీసులు విడుదల చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

