న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాలు డేటింగ్లో ఉన్నారనే వదంతుల నేపధ్యంలో ఆప్ నేత (AAP) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవ్, పరిణీతి డిన్నర్, లంచ్ మీట్లకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో వీరి మధ్య సన్నిహిత బంధంపై పుకార్లు మరింత ఊపందుకున్నాయి.
నటి పరిణీతితో స్నేహం వారి మధ్య డేటింగ్ వార్తలపై ఆప్ నేతను ప్రశ్నించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు నన్ను రాజ్నీతికి (రాజకీయాలు) సంబంధించిన ప్రశ్నలు అడగండి..పరిణీతి గురించి కాదని రాఘవ్ చద్దా నవ్వుతూ బదులిచ్చారు. వీరిద్దరూ కలిసి వరుసగా రెండు రోజుల పాటు డిన్నర్, లంచ్ మీటింగ్స్‌లో కనిపించగానే వీరు డేటింగ్లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
అయితే వీరిద్దరూ డేటింగ్లో లేరని, వీరు ఎప్పటి నుంచో మంచి స్నేహితులని తెలిసింది. వీరిద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో కలిసి చదువుకున్నారు..ఇద్దరికీ తెలిసిన కామన్ ఫ్రెండ్స్ కూడా ఎందరో ఉన్నారని వెల్లడైంది. వీరిద్దరికీ ప్రయాణాలంటే ఇష్టమని, వీరు తరచూ అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటారని తెలిసింది. రాఘవ్ ట్విట్టర్లో కేవలం 44 మందిని ఫాలో అవుతుంటే అందులో ఇద్దరే బాలీవుడ్‌కు చెందిన వారు. వీరిలో ఒకరు పరిణీతి కాగా మరొకరు గుల్ పనాగ్.
Read More :