AAP leaders | మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లకు ఏసీబీ నోటీసులు.. ఎందుకంటే..!
AAP leaders | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyender Jain) లకు ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ (ACB) నోటీసులు జారీచేసింది. ఢిల్లీలోని స్కూల్ బిల్డింగులు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి.
AAP leaders : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyender Jain) లకు ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ (ACB) నోటీసులు జారీచేసింది. ఢిల్లీలోని స్కూల్ బిల్డింగులు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏసీబీ ఇవాళ వారికి నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 6న సత్యేందర్, 9న సిసోడియా ఢిల్లీలోని ఏసీబీ బ్యూరో కార్యాలయానికి రావాలని నోటీసులలో ఆదేశించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్ ప్రభుత్వ హయాంలో సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) మంత్రిగా పనిచేశారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం చేశారు. ఈ నిర్మాణ పనుల్లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ పనులకు సంబంధించి మొత్తం 34 మందికి కాంట్రాక్టులు దక్కగా వారిలో చాలామందికి ఆప్తో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తేలింది. కాంట్రాక్టర్లు నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయకపోగా భారీగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదులను కేవలం 30 సంవత్సరాలు మన్నిక ఉండేలా నిర్మించారని, కానీ వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
కాంట్రాక్టర్లు గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్లను నియమించుకోవడంతో వ్యయం దాదాపు ఐదురెట్లు పెరిగిపోయింది. ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది.
ఈ కేసులో మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఏప్రిల్లో వారిపై కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

