న్యూఢిల్లీ: డేటింగ్ యాప్(Dating App)లో పరిచయమైన యువతిపై .. హర్యానాలోని గురుగ్రామ్ హోటల్లో అత్యాచారం జరిగింది. ఆ మహిళపై పరిచయమైన వ్యక్తితో పాటు మరొకరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. జూన్ 29వ తేదీన ఈ ఘటన జరిగింది. డేటింగ్ యాప్‌లో పరిచయం తర్వాత ఆ వ్యక్తి యువతిని హోటల్‌కు ఆహ్వానించాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 50 ఏరియాలో ఉన్న హోటల్‌కు ఆ అమ్మాయి వెళ్లింది. అయితే అక్కడ ఆ అమ్మాయిపై రేప్ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చింది.
హోటల్‌కు వెళ్లిన తనకు డిన్నర్ ఆఫర్ చేశారని, అయితే ఆ భోజనం తిన్న తర్వాత తాను మత్తులోకి వెళ్లిపోయానని, ఆ తర్వాత ఆ ఇద్దరూ తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని, వీడియో కూడా తీశారని, ఒకవేళ ఎదురు తిరిగితే వీడియోను బయటపెడుతామని హెచ్చరించినట్లు కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొన్నది.
స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై గ్యాంగ్ రేప్ కింద హర్యానా పోలీసులు కేసు బుక్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో ప్రవీణ్ మాలిక్ తెలిపారు.