ముంబై, సెప్టెంబర్ 1: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను వివాహం చేసుకోవడం ఆమెకు అన్యాయం చేయడమే కాక, రెండో భార్యపై లైంగికదాడి చేసినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది. రెండో వివాహం చేసుకున్నందుకు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ పుణెకు చెందిన ఒక విద్యావేత్త దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినా విడాకులు తీసుకున్నానంటూ నమ్మించి రెండో మహిళను వివాహం చోసుకోవడం లైంగిక నేరం కిందకు వస్తుందని పేర్కొంటూ హైకోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసింది.