తూచ్.. అదంతా ఉత్తదే!.. ధర్మస్థల కేసులో షాకింగ్ ట్విస్ట్
వందలాది మృతదేహాల ఖననం జరిగిందన్న ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ధర్మస్థలలో రేప్ చేసి హత్యకు గురైన వందలాది మృతదేహాలను ఖననం చేశానన్న పారిశుద్ధ్య కార్మికుడు యూ టర్న్ తీసుకున్నాడు.
- మాట మార్చిన పారిశుధ్య కార్మికుడు సీఎస్ చిన్నయ్య
- తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- సుజాత భట్ చెప్పిందీ కట్టు కథే
బెంగళూరు, ఆగస్టు 23: వందలాది మృతదేహాల ఖననం జరిగిందన్న ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ధర్మస్థలలో రేప్ చేసి హత్యకు గురైన వందలాది మృతదేహాలను ఖననం చేశానన్న పారిశుద్ధ్య కార్మికుడు యూ టర్న్ తీసుకున్నాడు. తనకేమీ తెలియదంటూ మాటమార్చాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే తన కుమార్తె తప్పిపోయిందంటూ బెంగళూరు మహిళ చెప్పినవన్నీ కూడా కట్టు కథలేనని నిర్ధారించారు.
మాయమాటలు చెప్పి వ్యవస్థను నమ్మించడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడు తనకేమీ తెలియదని అంటున్నాడని, కొందరు ఒక పుర్రెను చేతికిచ్చి అధికారులకు ఫిర్యాదు చేయమన్నారని, కోర్టులో కేసు కూడా వారే వేయించారని సిట్‌కు చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఇంత సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు ఉత్తదేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య అలియాస్ చెన్నా చెప్పినవన్నీ అబద్ధాలు, కట్టుకథలేనని అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో ఆయన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశాడు. అయితే దానిని ప్రత్యేక దర్యాప్తు బృందం విశ్వసించ లేదు. అయితే అతడు చెప్పిన విధంగా వారు తవ్వకాలు జరపడం, అతను పేర్కొన్నట్టు ఏమీ లభ్యం కాకపోవడంతో అనుమానం వచ్చిన సిట్ అధికారులు అతడిని తిరిగి ప్రశ్నించి, అతడు అబద్ధాలు చెబుతున్నట్టు కనుగొన్నారు. దీంతో అప్పటివరకు సాక్షిగా అతనికి కల్పిస్తున్న రక్షణను, ముసుగును తొలగించి అతడి పేరును తొలిసారిగా వెల్లడించారు. అతను మండ్యకు చెందిన సీఎస్ చిన్నయ్యగా పేర్కొన్నారు. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు అతడిని అరెస్ట్ చేశారు.
అనన్య అనే అమ్మాయే లేదు
ధర్మస్థల కేసులో మరో షాకింగ్ యూటర్న్ చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తె అనన్య భట్ ధర్మస్థలలో అదృశ్యమైందంటూ ఇంతవరకూ ఆరోపణలు చేస్తున్న ఆమె తల్లి సుజాత భట్ షాకిచ్చే ప్రకటన చేసింది. అసలు అనన్య భట్ పేరుతో ఎవరూ లేరని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఆమె తాజాగా మరో యూటర్న్ తీసుకుని, తనను అలా చెప్పమని కొందరు బలవంతం చేశారని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

