ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. అమెరికా, కెనడా, మెక్సికోతోపాటు ఉత్తరఅమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. మెక్సికోలో సోమవారం ఉదయం 11.07 గంటలకు, టెక్సాస్‌లో మధ్యాహ్నం 1.27కు గ్రహణం ఏర్పడింది. గ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబర్చారు. ఆన్లైన్లో నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. దాదాపు 50 ఏండ్ల తర్వాత, సుదీర్ఘంగా సాగిన సూర్యగ్రహణం ఇదే. సుమారు 4.27 నిమిషాలపాటు గ్రహణం కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనావేశారు. భారత్‌లో గ్రహణం కనిపించదని పేర్కొన్నారు.