Crime news | మహారాష్ట్రలో దారుణం.. పసిబిడ్డ నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి
Crime news | మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డ పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. మళ్లీ ఆడబిడ్డే పుట్టిందన్న కోపంతో పసికందు నోట్లో పొగాకు కుక్కి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశాడు.
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డ పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. మళ్లీ ఆడబిడ్డే పుట్టిందన్న కోపంతో పసికందు నోట్లో పొగాకు కుక్కి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశాడు. ఆశా కార్యకర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జల్గావ్ జిల్లాలోని పహూర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల హరినగర్ తండాలో గోకుల్ జాదవ్ (30) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. జాదవ్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలున్నారు. తాజాగా మూడో కాన్పులో కూడా ఆడబిడ్డే పుట్టడంతో జాదవ్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో కన్న మమకారాన్ని కూడా మరిచిపోయి దారుణంగా చిన్నారి నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు.
అయితే, బిడ్డ పుట్టిందనే విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త జనన నమోదు కోసం తండాకు వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లాక పాప మరణించిందని తెలిసింది. ఎలా మరణించిందని ఆరా తీయగా ఆమె తండ్రే నోట్లో పొగాకు కుక్కి చంపిన విషయం బయటపడింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

