నగ్న వీడియోల షేరింగ్ కేసు.. వైద్యుడు, ప్రియురాలు అరెస్ట్
Nude Pics: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ తోటి మహిళల నగ్న ఫొటోలు, వీడియోలను ప్రియుడికి షేర్ చేసిన కేసులో.. ఓ వైద్యుడిని
మధురై: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ తోటి మహిళల నగ్న ఫొటోలు, వీడియోలను ప్రియుడికి షేర్ చేసిన కేసులో.. ఓ వైద్యుడిని, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధురైలోని రామనాథపురం కాముడి ఏరియాకు చెందిన వైద్యుడు ఆశిక్ స్థానికంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. జనని అనే యువతి బీఈడీ చదువుతూ, ఆశిక్ క్లినిక్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది.
ఈ క్రమంలో ఆశిక్కు, జననికి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. దాంతో ఆశిక్ కోరిక మేరకు ఆమె హాస్టల్ నుంచి తన ఫొటోలను, వీడియోలను అతనికి పంపించేది. ఆ తర్వాత తన హాస్టల్మేట్స్ ఫొటోలు, వీడియోలు కూడా పంపాలని ఆశిక్ కోరడంతో.. ఆ పని కూడా మొదలు పెట్టింది. హాస్టల్ మేట్స్ బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానాలు చేసేటప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి ఆశిక్ షేర్ చేసేది.
ఎప్పటిలాగే గత గురువారం కూడా జనని ఓ యువతిని వీడియో తీస్తుండగా గమనించి ఫోన్ లాక్కుంది. అందులో తన వీడియోలు చూసి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసింది. హాస్టల్ వార్డెన్ జనని ఫోన్‌ను పరిశీలించగా.. తోటి మహిళలకు చెందిన అనేక నగ్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి. దాంతో ఆమె అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన నిందితుల కోసం గాలించి ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేసి డిలీట్ చేసిన డాటా రికవరీ కోసం ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు. కాగా, జనని పంపిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను ఆశిక్ మాత్రమే చూశాడా, ఇతరులకు కూడా షేర్ చేశాడా అనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

