Bride Dragged Away | తాళి కట్టడానికి కొన్ని క్షణాల ముందు పెళ్లి పీటల పైనుంచి వధువును లాక్కెళ్లిన పోలీసులు..!
Bride Dragged Away | కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వధూవరులిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతమంది స్నేహితుల మధ్య ఓ గుడిలో పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లిపీటలపై వధూవరులిద్దరూ ఆసీనులయ్యారు. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడు అనగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
తిరువనంతపురం: కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వధూవరులిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతమంది స్నేహితుల మధ్య ఓ గుడిలో పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లిపీటలపై వధూవరులిద్దరూ ఆసీనులయ్యారు. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడు అనగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రెండు వాహనాల్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. పెళ్లి పీటల మీద ఉన్న వధువును బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో పడేశారు. అడ్డుకోబోయిన వరుడిని నెట్టిపడేశారు. కానీ, ఆఖరికి కోర్టు అనుమతితో ఇద్దరూ ఒక్కటయ్యారు.
సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు కేరళలోని తిరువనంతపురం జిల్లా వేదికైంది. జిల్లాలోని కాయమ్‌కులమ్ పట్టణానికి చెందిన అల్ఫియా అనే యువతి, కోవలం పట్టణానికి చెందిన అఖిల్ అనే యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ మేరకు కోవలం పట్టణ సమీపంలోని ఓ గుడిలో స్నేహితుల సహకారంలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం రాత్రి పెళ్లి తంతు మొదలైంది. ఇంతలో కాయమ్కులం పట్టణ పోలీసులు రెండు వాహనాల్లో వచ్చిన వధువు బలవంతంగా లాక్కెళ్లారు. ‘నా ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నా.. నేను రాను..’ అంటూ వధువు అరిచి గీ పెట్టినా పోలీసులు విడిచిపెట్టలేదు. వరుడు అడ్డుపడినా పక్కకు తోసేసి కోవలం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా తనను విడిచిపెట్టాలంటూ వధువు గోల చేసింది. వరుడు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా ఈడ్చి బయటపడేశారు.
ఇదంతా చూసి ఇక వాళ్లు ఒక్కటి కాలేరు అనుకున్నారు అంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. వధువును కోర్టులో హాజరుపర్చగా ఆమె వాంగ్మూలం విన్న న్యాయమూర్తి వారి పెళ్లికి అనుమతించారు. దాంతో ఇద్దరూ గుడికి వెళ్లి పెళ్లి తంతు పూర్తిచేశారు. కాగా, పెళ్లి మధ్యలో పోలీసుల వ్యవహరించిన తీరుపై వధూవరులిద్దరూ విచారం వ్యక్తం చేశారు. తాము ఇద్దరం మేజర్లమని, ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా హంగామా చేయడం తమకు చేదు జ్ఞాపకమని అన్నారు.
ఇదే విషయమై మీడియా పోలీసులను ప్రశ్నించగా.. వధువు పేరెంట్స్ కాయమ్కులం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారని, దాంతో వధువును వెతికి పట్టుకుని కోర్టులో హాజరుపర్చాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. కాబట్టి వధువును బలవంతంగా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చిందని, తమ డ్యూటీ తాము చేశామని అన్నారు. కోర్టులో వధువు వాంగ్మూలం విన్న న్యాయమూర్తి పెళ్లికి అనుమతించడంతో తాము ఆమెను విడిచిపెట్టామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

