e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఆ డాక్ట‌ర్ 8 నెల‌ల ప్రెగ్నెంట్‌.. అయినా ఆమె వృత్తికే అంకితం

ఆ డాక్ట‌ర్ 8 నెల‌ల ప్రెగ్నెంట్‌.. అయినా ఆమె వృత్తికే అంకితం

ఆ డాక్ట‌ర్ 8 నెల‌ల ప్రెగ్నెంట్‌.. అయినా ఆమె వృత్తికే  అంకితం

క‌థువా: జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఓ డాక్ట‌ర‌మ్మ చూపిస్తున్న తెగువకు సెల్యూట్ కొట్టాల్సిందే. క‌థువాలో వైద్యురాలిగా ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న డాక్ట‌ర్ శివాని 8 నెల‌ల గ‌ర్భ‌వతి. నిజానికి ఆమె రెస్ట్ తీసుకోవాల్సిన రోజులు ఇవి. అస‌లే కోవిడ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో.. ప్రెగ్నెంట్ అయిన డాక్ట‌ర్ శివాని త‌న వృత్తి ప‌ట్ల అకుంఠిత‌మైన అంకితభావాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల చాలా వ‌ర‌కు డాక్ట‌ర్లు అందుబాటులో లేకుండాపోయారు. అయినా శివాని మాత్రం త‌న క‌డుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించ‌కుండానే.. హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన వారికి అవిశ్రామంగా వైద్యం అందిస్తోంది. త‌న‌కు ఎనిమిదో నెల అని, నిజానికి కొద్దిగా వ‌త్తిడి ఉన్నా.. ప్రెగ్నెన్సీలో ప‌నిచేయ‌డం తానేమీ ఇబ్బందిగా భావించ‌డం లేద‌ని ఆమె అన్నారు. డాక్ట‌ర్ల కొర‌త వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారని, వారికి సేవ చేయ‌డేమ త‌న క‌ర్త్య‌మ‌ని డాక్ట‌ర్ శివాని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ డాక్ట‌ర్ 8 నెల‌ల ప్రెగ్నెంట్‌.. అయినా ఆమె వృత్తికే  అంకితం

ట్రెండింగ్‌

Advertisement