70 ఏండ్ల వృద్ధుడి కాల్చివేత.. కుమారుడి అరెస్ట్..!
Old man shot dead: మంగళవారం రాత్రి పంట చేను కాపలా కోసం వెళ్లిన మహేంద్రసింగ్.. బుధవారం తెల్లవారుజామును పంట చేనులోనే

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇటాహ జిల్లా సర్దల్గాహ్ గ్రామంలో మహేంద్రసింగ్ (70) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి పంట చేను కాపలా కోసం వెళ్లిన మహేంద్రసింగ్.. బుధవారం తెల్లవారుజామును పంట చేనులోనే శవమై కనిపించాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహంపై బుల్లెట్ గాయాలు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపినట్లు నిర్ధారణకు వచ్చారు.
అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. హంతకుడు ఎవరై ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతుడి చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

