Students | దేశంలో 70 శాతం పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు.. అసలెందుకు చనిపోతున్నారు?
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 70 శాతం పెరిగాయి.
Students | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 70 శాతం పెరిగాయి. ఐఐటీల్లో దళిత విద్యార్థులు, రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ-జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం కలిచివేసే ఘటనలు. ఈ ఏడాది కోటాలో 23 మంది ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 10న ‘ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం’ సందర్భంగా ఎన్సీఆర్బీ గణాంకాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2011లో చోటుచేసుకున్న మొత్తం ఆత్మహత్యల్లో.. 2.3% విద్యార్థుల ఆత్మహత్యలు కాగా.. 2021నాటికి ఇది 8శాతానికి పెరిగింది.
కారణాలేంటి?
18 ఏండ్ల లోపు బాధితులు కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ-2021 నివేదిక పేర్కొన్నది. తర్వాతి స్థానాల్లో లవ్ అఫైర్లు (1495), అనారోగ్యం (1408), పరీక్షల్లో ఫెయిల్ (864) ముఖ్య కారణాలుగా నిలిచాయి. కేవలం కౌన్సెలింగ్‌తో విద్యార్థుల ఆత్మహత్యల్ని అడ్డుకోలేమని, విద్యార్థుల ఇష్టాయిష్టాల్ని ప్రోత్సహించాలని ఢిల్లీ వర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఇట్షా నాగర్ అభిప్రాయపడ్డారు.
సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలు
2011 7,696
2013 8,423
2015 8,934
2017 9,905
2019 10,335
2021 13,089
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

