Indian students | విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థులు మృతి.. కెనడా, అమెరికాలో అత్యధిక మరణాలు
Indian students | విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. (Indian students) కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లు తెలిపారు. ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి కారణాల వల్ల 2019 నుంచి 41 దేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థులు చనిపోయినట్లు చెప్పారు.
కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కెనడాలో అత్యధికంగా 172 మంది భారతీయ విద్యార్థుల మరణించారు. ఆ తర్వాత 108 మరణాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్‌లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒక భారతీయ విద్యార్థి మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కెనడాలో జరిగిన దాడుల్లో అత్యధికంగా తొమ్మిది మంది, అమెరికాలో ఆరుగురు మరణించారు. ఆస్ట్రేలియా, చైనా, బ్రిటన్, కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన దాడుల్లో ఒక్కరు చొప్పున ఇండియన్ స్టూడెంట్స్ చనిపోయారు.
గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abroad
- Canada
- Died
- Indian students
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

