ఎయిర్ బస్‌పై ‘రేడియేషన్’ ఎఫెక్ట్
ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్ర, శనివారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ320 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- ‘సౌర’ సాంకేతిక సమస్యతో 6 వేల సర్వీసులపై ప్రభావం
- ప్రపంచ వ్యాప్తంగా విమానాల సేవలకు తీవ్ర అంతరాయం
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్ర, శనివారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ320 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 6 వేల విమానాలపై దీని ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సెలవు ప్రయాణాలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా, ఇండిగో విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లోనూ 400 విమాన సర్వీసులపై దీని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. సోలార్ రేడియేషన్ కారణంగా ఈ సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇది ఎయిర్ బస్ కంపెనీ 55 సంవత్సరాల చరిత్రలో అతి పెద్ద సంక్లిష్ట సమయాన్ని సూచించింది. ఈ సమస్య ఎలివేటర్ ఐలిరాన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వెర్షన్ ఎల్104ను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఇది ఎత్తును లెక్కిస్తుంది. అయితే సోలార్ రేడియేషన్ కారణంగా ఏర్పడిన సమస్యతో అధిక ఎత్తులో ఇది అసలైన డాటాను చూపలేకపోతున్నది.
ఎత్తును చూపడంలో సమస్యలు
అక్టోబర్ 30న కాకున్ నుంచి న్యూయార్క్‌కు జెట్‌బ్లూ ఎయిర్వేస్ ఏ320 విమానం వెళ్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానం 35 వేల అడుగుల ఎత్తులో ఉండగా, ఎలాంటి కమాండ్లు లేకుండానే దిగడం ప్రారంభించింది. ఈ ఘటనలో కనీసం 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఫ్లోరిడాలోని టాంపాలో ల్యాండ్ చేశారు. సోలార్ రేడియేషన్ ఈఎల్ఏసీ డాటాను దెబ్బ తీయంతో ఇది జరిగిందని నిర్ధారించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ320 సీఈవో, ఏ320 నియో వేరియంట్ విమానాల్లో ఈ ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీనిని సరి చేయడానికి విమానయాన సంస్థలు ఈఎల్ఏసీ సాఫ్ట్‌వేర్‌ను ఎల్103కి మార్చాలి. లేదా హార్డ్‌వేర్‌ను భర్తీ చేయాలి.
భారత్ పైనా ప్రభావం
తాజా సమస్య ప్రభావం భారత్‌లోని విమానయాన సేవలపైనా పడింది. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమానయాన సంస్థల్లో ఏ320 విమానాలు ఉండటంతో భారత్‌లో సుమారు 400 విమానాల రాకపోకలపై దీని ప్రభావం పడింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్ 90 శాతం పూర్తయిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ సమస్యపై పనిచేస్తున్నట్టు ఇండిగో తెలిపింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్ పూర్తి చేసిన తర్వాతే విమాన సర్వీసులు పునరుద్ధరిస్తారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

