Uttar Pradesh | ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి ఆత్మహత్య చేసుకున్న 60 ఏండ్ల వృద్ధుడు
Uttar Pradesh | ముక్కుపచ్చలారని ఓ ఐదేండ్ల బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు విరుచుకుపడ్డాడు. ఓ పశువులా ప్రవర్తించాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫరీద్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Uttar Pradesh | లక్నో : ముక్కుపచ్చలారని ఓ ఐదేండ్ల బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు విరుచుకుపడ్డాడు. ఓ పశువులా ప్రవర్తించాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫరీద్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఫరీద్పూర్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఐదేండ్ల చిన్నారి.. ఆడుకునేందుకు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆడుకుంటున్న బాలికపై షేర్ మహ్మద్(60) అనే వృద్ధుడు కన్నేశాడు. మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిని అత్యాచారం చేశాడు.
బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. ఆమె ఆచూకీ కోసం వెతికారు. షేర్ మహ్మద్ ఇంట్లోకి వెళ్లి చూడగా, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. మహ్మద్ అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తప్పించుకున్న మహ్మద్.. గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయంతోనే మహ్మద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. వృద్ధుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

