Road Accident | కారును ఢీకొట్టిన రాయి.. లోయలో పడడంతో ఆరుగురు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు.
చంబా: హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఛన్వాస్ ప్రాతంలో కొండపై నుంచి పడిన ఓ రాయి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు 500 మీటర్ల లోతున్న లోయలో పడింది. ఈ ఘటనలో రాజేష్, హన్సో (36) దంపతులు, వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్ (15), బావమరిది హిమరాజ్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఆరుగురు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని చంబా ఎస్పీ అభిషేక్ యాదవ్ తెలిపారు. వారంతా ఘటనా స్థలంలోనే మృతిచెందారన్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు స్థానికులతో కలిసి మృతదేహాలను వెలికి తీశారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

