చండీగఢ్, జనవరి 9: హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యారు. 1991 బ్యాచ్‌కి చెందిన ఖేమ్కా తన 30 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో వివిధ విభాగాలకు బదిలీ కావడం ఇది 55వ సారి. ఆర్కైవ్ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శిగా ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది.
అయితే బదిలీకి కారణం ఏమిటో ప్రభుత్వం వెల్లడించలేదు. ఖేమ్కాతోపాటు సోమవారం మరో నలుగురు హర్యానా సివిల్ సర్వీస్ అధికారులను కూడా బదిలీ చేశారు.