Monkey Throws Baby | ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. బరేలీ జిల్లాలోని దుంకా గ్రామంలో మూడంతస్తుల భవనం నుంచి వానరాలు నాలుగు నెలల పసికందును కింద పడేశాయి. దీంతో అక్కడికక్కడే ఆ పసికందు దుర్మరణం పాలైంది. ఈ సంగతి తెలిసిన బరేలీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ లలిత్ వర్మ మాట్లాడుతూ ఘటనా స్థలానికి అధికారుల బృందాన్ని పంపినట్లు చెప్పారు.
దుంకా వాసి నిర్దేష్ ఉపాధ్యాయ్ (25) మాట్లాడుతూ తన భార్య శుక్రవారం సాయంత్రం తమ మూడంతస్తుల మేడపై వాకింగ్ చేస్తుండగా వానరాల శబ్దాలు వినిపించాయని చెప్పాడు. వాటి బారీ నుంచి తమ బేబీని కాపాడుకునేందుకు ప్రయత్నించామని, కానీ ఆ బేబీని అప్పటికే వానరాలు చుట్టుముట్టాయని తెలిపాడు.
అయినా తప్పించుకుని మెట్లమీదుగా కిందకు పరుగు తీస్తున్న నిర్దేశ్ చేతుల నుంచి బేబీ కింద పడిపోయింది. ఆ బేబీని తిరిగి నిర్దేశ్ తన చేతుల్లోకి తీసుకునే లోపే వానరం తన చేతుల్లోకి తీసుకుని మేడ మీద నుంచి కింద పడేసింది. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మరణించింది.