వాళ్లందరికీ 4 లక్షలు ఇవ్వడం కుదరదు.. సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనాతో చనిపోయిన వాళ్లందరి కుటుంబాలకు నాలుగేసి లక్షలు ఇస్తే కొవిడ్ సహాయక నిధులు సరిపోవని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. సహాయక చర్యలకు కనీస ప్రమాణాలు, చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోరుతూ దాఖలైన పిల్‌కు సంబంధించి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఉంటుందని, కొవిడ్ బాధితులకు రూ.4 లక్షలు ఇవ్వడం కుదరదని అఫిడవిట్లో కేంద్రం తేల్చి చెప్పింది.
ఇండియాలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకూ 4 లక్షల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత మందికి ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ఇవ్వాలంటే మొత్తం ఎస్డీఆర్ఎఫ్ నిధులు దీనికే ఖర్చయిపోతాయి. మిగతా వాటి కోసం మరింత భారీగా వెచ్చించాల్సి వస్తుంది అని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా అత్యవసర మందులు, ఇతర కొనుగోళ్లతోపాటు తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమవుతుందని స్పష్టం చేసింది.
కొవిడ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఇతర విపత్తుల విషయంలో తీసుకునే కనీసం సహాయ ప్రమాణాలు, పరిహారం ఇవ్వడం కుదరదని కేంద్రం అభిప్రాయపడింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 2019-20లో కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రాలకు అదనంగా రూ.1113.21 కోట్లు విడుదల చేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

