Thamilanadu | టీవీకే సర్కార్‌ను కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్ల ఆఫర్
తమ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడేందుకు బేరసారాలు సాగిస్తున్నారంటూ అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే బుధవారం పరస్పరం ఆరోపణాస్ర్తాలు సంధించుకున్నాయి.
- ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్ల ఆఫర్
- టీవీకే ఫిర్యాదుపై ముగ్గురి అరెస్ట్
చెన్నై, జూలై 1: తమ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడేందుకు బేరసారాలు సాగిస్తున్నారంటూ అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే బుధవారం పరస్పరం ఆరోపణాస్ర్తాలు సంధించుకున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీమంత్రి వీ సెంథిల్ బాలాజీ ప్రయత్నించారంటూ టీవీకే ఆరోపించగా, ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఎండీఎంకే అధినేత వైకో కుట్ర పన్నారని డీఎంకే ఆరోపించింది.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను సంప్రదించినట్లు ఉతన్గరైకు చెందిన టీవీకే ఎమ్మెల్యే ఏఎన్ ఇళయరాజా చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తిరునావుక్కరసు అనే వ్యక్తి కూడా ఉన్నారు. టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వీరిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరునావుక్కరసు ప్రలోభపెట్టినట్లు ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఉండగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారి చేత రాజీనామా చేయించడానికి ముఖ్యమంత్రి విజయ్ ప్రయత్నించారని ఆరోపిస్తూ డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి రాష్ట్ర గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో వారి తరఫున ప్రచారం చేసి గెలిపించుకుంటానని విజయ్ మాటిచ్చారంటూ ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో చేసిన ప్రకటనను భారతి ఉటంకించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

