అస్సాం, మేఘాలయాలో వరదలు.. 31 మంది మృతి
గౌహతి: అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజుల నుంచి వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది మరణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 లక్షల మంది ప్రభావానికి గురయ్యారు. లక్ష మంది రిలీఫ్ క్యాంపులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. అస్సాంలో 12 మృతిచెందగా, మేఘాలయాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రిపుర రాజధాని అగర్తలాలో భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ నగరంలో సుమారు 6 గంటల్లోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో త్రిపుర ఉప ఎన్నిక ప్రచారంపై తీవ్ర ప్రభావం పడింది. మేఘాలయాలోని చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. అగర్తలాలో 60 ఏళ్ల తర్వాత మూడవ అత్యధిక వర్షం పాతం నమోదైంది. ఆకస్మిక వరదల వల్ల స్కూళ్లను మూసివేశారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు మేఘాలయా సీఎం 4 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అస్సాం వరదల్లో మూడు వేల గ్రామాలు మునిగాయి. 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది. కల్వర్టులు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

