30 ఏండ్లలో మూడుసార్లు
మహారాష్ట్రలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే దశకు చేరుకున్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి
శివసేనలో సంక్షోభాలు కొత్తేమీకాదు
ముంబై, జూన్ 22: మహారాష్ట్రలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే దశకు చేరుకున్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 మంది) సభ్యులు ఉండాలి. అయితే, గువాహటిలోని షిండే క్యాంపులో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన పార్టీకి ఇలాంటి సంకట పరిస్థితి ఎదుర కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో మూడు సార్లు శివసేన రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నది.
గతంలో కుదుపులు
1991-పార్టీలో మనోహర్ జోషికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించలేకపోయిన చగన్ భుజ్బాల్ తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో (అప్పుడు పార్టీ మొత్తం బలం 52 మంది ఎమ్మెల్యేలు) శివసేనపై తిరుగుబావుటా ఎగురవేశారు. శివసేన-బీ పేరిట కొత్త పార్టీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో బాల్‌ఠాక్రే భుజ్‌బాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, అదేరోజు 12 మంది ఎమ్మెల్యేలు శివసేనలో చేరారు. భుజ్బాల్ కాంగ్రెస్‌లో చేరారు.
2005: ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారని జూలైలో నారాయణ్ రాణె 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీకి వ్యతిరేకంగా క్యాంప్ పెట్టారు. అయితే, రాణె వ్యూహాన్ని శివసేన కొంతవరకూ చేధించి రెబల్స్లోని 28 మంది ఎమ్మెల్యేల మద్దతును మళ్లీ కూడగట్టగలిగింది. మిగతా 12 మందిని సస్పెండ్ చేసింది. దీంతో రాణె సహా వీరంతా కాంగ్రెస్‌లో చేరారు.
2006: పార్టీలో కొందరి పెత్తనం పెరిగిపోయిందని బాల్‌ఠాక్రే మేనల్లుడు రాజ్‌ఠాక్రే పార్టీని వీడా రు. శివసేనలో చీలిక తప్పదని, తన వెంట ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన పేరిట పార్టీ పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
Bigg Boss 10 | హౌస్ చివరి కెప్టెన్‌గా దేబ్జానీ.. వర్షిణి, త్రిగుణ్ మధ్య మరోసారి భారీ హైడ్రామా!
HMDA Land Auction | వేలం..మళ్లీ అట్టర్‌ఫ్లాప్.. కోకాపేట్, మూసాపేట్ భూములకూ కరువైన బిడ్డర్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

