Looting Bride | మూడు పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు.. ‘లూటీ వధువు’ అరెస్ట్
Looting Bride | ఒక మహిళ పలువురిని పెళ్లాడింది. ఆ తర్వాత వారి నుంచి విడిపోయి డబ్బులు డిమాండ్ చేసింది. ఇలా ఇప్పటి వరకు ముగ్గురిని వివాహం చేసుకున్నది. వారి నుంచి రూ.1.25 కోట్ల మేర లూటీ చేసింది. ఆ ‘లూటీ వధువు’ను చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు.
జైపూర్: ఒక మహిళ పలువురిని పెళ్లాడింది. ఆ తర్వాత వారి నుంచి విడిపోయి డబ్బులు డిమాండ్ చేసింది. ఇలా ఇప్పటి వరకు ముగ్గురిని వివాహం చేసుకున్నది. వారి నుంచి రూ.1.25 కోట్ల మేర లూటీ చేసింది. (Looting Bride) మూడో భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ‘లూటీ వధువు’గా పేర్కొన్న ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నిక్కి అలియాస్ సీమ 2013లో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్తను తొలిసారి పెళ్లాడింది. కొంత కాలం తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై కేసు పెట్టింది. కేసు రాజీలో భాగంగా రూ.75 లక్షలు అందుకున్నది.
కాగా, 2017లో గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సీమా వివాహం చేసుకున్నది. అతడి నుంచి విడిపోయిన ఆమె సెటిల్మెంట్గా రూ.10 లక్షలు తీసుకున్నది. ఆ తర్వాత 2023లో జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తతో సీమా పెళ్లి జరిగింది. అయితే ఆ వెంటనే రూ.36 లక్షల విలువైన బంగారు నగలు, నగదుతో అతడి ఇంటి నుంచి పారిపోయింది. వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీమాను అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితురాలు సీమాను ‘లూటేరి దుల్హన్’ (దోపిడీలకు పాల్పడుతున్న వధువు)గా జైపూర్ పోలీసులు అభివర్ణించారు. విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన ధనవంతులైన మగవారిని మ్యాట్రిమోనియల్ సైట్లలో వెతికి వారిని ఆమె టార్గెట్ చేస్తుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ముగ్గురిని పెళ్లాడిన సీమా వారి నుంచి రూ.1.25 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

