Bhavya Bishnoi | ఐఏఎస్‌తో ఎమ్మెల్యే పెండ్లి.. 3 లక్షల మందికి ఆహ్వానం..
Bhavya Bishnoi | బీజేపీ యువ ఎమ్మెల్యే పెండ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. హరియాణా మాజీ సీఎం భజన్‌లాల్ మనువడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 22న ఘనంగా జరగనుంది.
Bhavya Bishnoi | బీజేపీ యువ ఎమ్మెల్యే పెండ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. హరియాణా మాజీ సీఎం భజన్‌లాల్ మనువడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 22న ఘనంగా జరగనుంది. ఒక ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారిణి మ్యారేజ్ అంటే.. ఎలాగూ అంగరంగ వైభవంగానే జరుగుతుంది కదా.. అందులో వింత ఏముందని అనుకుంటున్నారా? కానీ నిజంగానే అంతకుమించి ఉంది. వీరి పెండ్లి రిసెప్షన్‌కు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది హాజరు కాబోతున్నారు. వీరంతా వీఐపీలు, వీవీఐపీలు అనుకుంటున్నారేమో! కానీ కాదు.. వీళ్లలో సగానికి పైగా అతిథులు సాదాసీదా ప్రజలే!
భవ్య బిష్ణోయ్ కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన తాత హరియాణాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి కుల్దీప్ బిష్ణోయ్ బీజేపీ నేత, మాజీ ఎంపీ. తండ్రీతాతల బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భవ్య బిష్ణోయ్.. అదంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్‌తో వివాహం నిశ్చయమైంది. గత ఏడాది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగ్గా.. ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెండ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక పుష్కర్, అదంపూర్, ఢిల్లీ మూడు నగరాల్లో రిసెప్షన్లు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని అతిథుల కోసం డిసెంబర్ 24న పుష్కర్‌లో మొదటి రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి 30 నుంచి 50 వేల మంది వరకు అతిథులు హాజరుకానున్నారు. డిసెంబర్ 27న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. ఈ ఈవెంట్ కోసం పలువురు కేంద్ర నాయకులతో పాటు 2500 నుంచి 3 వేల మందిని ఆహ్వానించారు.
ఢిల్లీ కంటే ముందు అదంపూర్‌లో మరో రిసెప్షన్ జరగనుంది. బిష్ణోయ్ కుటుంబాన్ని తరతరాలుగా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజల సమక్షంలో ఈ వేడుక నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 26 న జరగబోయే ఈ వేడుకకు నియోజకవర్గంలోని 80 గ్రామాలకు చెందిన లక్ష మందికి పైగా అతిథులు రానున్నారు. వీరికోసం ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించినట్లు భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్దీప్ బిష్ణోయ్ మీడియాకు తెలిపారు.
భవ్య బిష్ణోయ్ గతంలో సినీ నటి మెహ్రీన్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరికీ 2021లో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే వాళ్ల ఎంగేజ్మెంట్ రద్దయ్యింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్‌తో భవ్య బిష్ణోయ్ ప్రేమలో పడ్డారు. ఇక పరి బిష్ణోయ్ విషయానికొస్తే ఆమె 2019లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం సిక్కిం కేడర్‌లో గ్యాంగ్‌టక్‌లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

