Goa | గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మహిళలు సహా 25 మంది మృతి
ఉత్తర గోవాలో (Goa) ఘోర అగ్ని ప్రమాదం (Fire Acciden) జరిగింది. అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో (Night Club) అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో (Cylinder Blast) మంటలు చెలరేగాయి.
పనాజీ: ఉత్తర గోవాలో (Goa) ఘోర అగ్ని ప్రమాదం (Fire Acciden) జరిగింది. అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో (Night Club) అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో (Cylinder Blast) మంటలు చెలరేగాయి. దీంతో 25 మంది మృతి చెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యటకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు.

ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని చెప్పారు. క్లబ్లో భద్రతా నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని వెల్లడించారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్ లైసెన్స్‌లు రద్దుచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

बड़ी खबर👇
गोवा में धमाके से आग लगने पर 23 लोगों की मौत।उत्तरी गोवा में स्थित अर्पोरा गांव के एक नाइटक्लब में सिलिंडर ब्लास्ट से भीषण आग लग गई, जिसमें कम से कम 23 लोगों की मौत हो गई। pic.twitter.com/7R76b3o50E
— INC TV (@INC_Television) December 6, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Birch
- Cylinder blast
- Goa
- Nightclub
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

