Military Strength Ranking | ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్‌లు విడుదల.. టాప్‌లో అమెరికా.. భారత్ స్థానం ఎంతంటే..?
Military Strength Ranking | ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా మిలిటరీ పవర్ (Military Strength) అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానం దక్కించుకుంది. ఇక భారత్ నాలుగోస్థానంలో నిలవడం విశేషం.
Military Strength Ranking | ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా మిలిటరీ పవర్ (Military Strength) అనేది చాలా ముఖ్యం. తమ దేశాన్ని కాపాడుకోవడంలో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మిలిటరీ ముందుంటుంది. ఇందుకోసం అన్ని దేశాలు తమ ఆర్మీ పవర్‌ను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతాయి. ఏటా చాలా దేశాలు ఆర్మీ పవర్‌ను పెంచుకుంటుంటాయి కూడా. అయితే, ప్రపంచంలో ఏ దేశం మిలిటరీ పవర్ ఫుల్‌గా (most powerful military globally) ఉందో తెలుసా..?
ఆ వివరాలను గ్లోబల్ ఫైర్ తాజాగా విడుదల చేసింది. గ్లోబల్ ఫైర్ పవర్స్ (Global Firepower) మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్-2024 పేరుతో ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్‌లుగా మార్చి రిలీజ్ చేసింది. సైనికుల సంఖ్య, ఆయుధాలు, ఆర్థిక సుస్థిరత, భౌగోళిక పరిస్థితి, వనరులు ఇలా మొత్తం 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించింది.
గ్లోబల్ ఫైర్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో చైనా దేశాలు నిలిచాయి. ఇక ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. సౌత్ కొరియా, యూకే, జపాన్, తుర్కియే, పాకిస్థాన్, ఇటలీ మిగతా స్థానాల్లో ఉన్నాయి.
ఇక ప్రపంచంలోనే మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న దేశాల జాబితాను కూడా గ్లోబల్ ఫైర్ విడుదల చేసింది. ఈ జాబితాలో భూటాన్ తొలి స్థానంలో నిలిచింది. మాల్డోవా, సూరినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా, బెలిజ్, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10 దేశాలు..
1. అమెరికా
2. రష్యా
3. చైనా
4. భారతదేశం
5. దక్షిణ కొరియా
6. యునైటెడ్ కింగ్డమ్
7. జపాన్
8. తుర్కియే
9. పాకిస్తాన్
10. ఇటలీ
ప్రపంచంలో మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న 10 దేశాలు..
1. భూటాన్
2. మోల్డోవా
3. సురినామ్
4. సోమాలియా
5. బెనిన్
6. లైబీరియా
7. బెలిజ్
8. సియెర్రా లియోన్
9. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
10. ఐలాండ్
Also Read..
Indian Students | కెనడాతో వివాదం.. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల
Iran Attacks | పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్
Salt | ఉప్పు ప్రాణానికి ముప్పు.. పరిమితికి మించి వాడకంతో ఏటా 18.9 లక్షల మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

