Murder | 15 ఏండ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.. ఐదేండ్లకే భార్యను మట్టుబెట్టాడు..
Murder | వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కానీ అతను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భర్తను ప్రశ్నించినందుకు ఆమెను గొంతు నులిమి చంపాడు.
Murder | చెన్నై : వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కానీ అతను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భర్తను ప్రశ్నించినందుకు ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఫౌసియా(20) చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. న్యూ కాలనీలోని ఓ ప్రయివేటు హాస్టల్లో ఉంటుంది. కేరళలోని కొల్లాంకు చెందిన ఆషిక్(20) గత కొన్నేండ్ల నుంచి ఫౌసియాను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మూడేండ్ల వరకు కలిసిమెలిసి ఉన్నారు. అయితే ఆషిక్ ఇతర అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫౌసియా గ్రహించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు.
గత కొంతకాలం క్రితం ఆషిక్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఫౌసియాను క్షమాపణలు కోరాడు. మళ్లీ పొరపాటు జరగనివ్వని ప్రాధేయపడ్డాడు. దీంతో ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఇక మూడో రోజుల క్రితం క్రోమ్‌పేట్‌లోని ఓ హోటల్లో దిగారు. అతని ఫోన్‌ను పరిశీలించగా, ఇతర అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. ఆ ఫోటోలపై నిలదీయగా, ఆవేశంలో ఫౌసియా గొంతు నులిమి చంపాడు. ఆమె డెడ్‌బాడీ ఫోటోలను వాట్సాప్ స్టాటస్‌గా పెట్టుకున్నాడు. దీంతో ఫౌసియా, ఆషిక్ ఫ్రెండ్స్ కలిసి పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కేసు దర్యాప్తు చేశారు. క్రోమ్‌పేట్‌లోని హోటల్లో ఫౌసియా డెడ్‌బాడీ గుర్తించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేట్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫౌసియా, ఆషిక్‌కు ఒక పాప ఉందని, ఆమెను చిక్మగళూరులో దత్తత ఇచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

