Constables Loot Bus Driver | బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు దోచుకున్న పోలీస్ కానిస్టేబుల్స్.. తర్వాత ఏం జరిగిందంటే?
Constables Loot Bus Driver | ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ నుంచి రూ.14 లక్షలు దోచుకున్నారు. (Constables Loot Bus Driver) దీని గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అరెస్ట్ చేశారు. అలాగే ఒక వ్యాపారి హవాలా మార్గంలో డబ్బు తరలించడంపైనా దర్యాప్తు చేస్తున్నారు.
భోపాల్: ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ నుంచి రూ.14 లక్షలు దోచుకున్నారు. (Constables Loot Bus Driver) దీని గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అరెస్ట్ చేశారు. అలాగే ఒక వ్యాపారి హవాలా మార్గంలో డబ్బు తరలించడంపైనా దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 23న స్థానిక వ్యాపారి అంకిత్ జైన్, అహ్మదాబాద్‌కు చెందిన కన్హయ్య లాల్‌కు రూ.14 లక్షలు ఒక పెట్టెలో ఉంచి ప్రైవేట్ బస్సు డ్రైవర్ ద్వారా పంపాడు. ఇండోర్‌లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో దర్యాప్తు పేరుతో బస్సు డ్రైవర్ నుంచి ఆ క్యాష్ బాక్స్‌ను తీసుకున్నారు. అయితే డబ్బుల స్వాధీనం గురించి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదు.
కాగా, తాను పంపిన రూ.14 లక్షలు కన్హయ్య లాల్‌కు అందలేదని వ్యాపారి జైన్‌కు తెలిసింది. దీంతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ నరేంద్ర తివారీపై చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్స్ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్ ఈ డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో దోపిడీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు, వ్యాపారవేత్త అంకిత్ జైన్, బస్సు డ్రైవర్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు పంపాడు అన్న దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు అనుమానించారు. స్వాధీనం చేసుకున్న ఈ డబ్బు గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని అదనపు డీసీపీ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

