family shot at by neighbour | యువతి కుటుంబంపై వ్యక్తి కాల్పులు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
family shot at by neighbour | ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. (family shot at by neighbour) ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పాట్నా: ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. (family shot at by neighbour) ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు ఛత్ పూజ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నారు. ఎదురింట్లో ఉండే యువకుడు పిస్టల్‌తో వారిపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో యువతి ఇద్దరు సోదరులు మరణించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, కుటుంబంపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఆశిష్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఆ కుటుంబానికి చెందిన యువతిని అతడు ప్రేమిస్తున్నాడని చెప్పారు. అయితే అతడితో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారని, పది రోజుల కిందట ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందని అన్నారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి పారిపోయిన నిందితుడ్ని వెతికి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బలగాలను మోహరించినట్లు పోలీస్ అధికారి వివరించారు.
#WATCH बिहार: लखीसराय एसपी पंकज कुमार ने कहा, "गोली मारने की घटना पीड़ितों के घर के सामने रह रहे आशीष चौधरी नाम के व्यक्ति ने किया। गोली 6 लोगों को लगी है जिसमें 2 लोगों की मृत्यु हो गई और 3 गंभीर रूप से घायल हैं और जिनको यहां से पटना मेडिकल कॉलेज एवं अस्पताल रेफर किया गया है और… pic.twitter.com/wNMdEnPXTB
— ANI_HindiNews (@AHindinews) November 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

