న్యూఢిల్లీ: బాలీవుడ్ ఫిల్మ్ 12th ఫెయిల్(12th Fail) .. ఆస్కార్స్‌కు పోటీపడనున్నది. ఆ ఫిల్మ్ స్టార్ విక్రాంత్ మాసే దీనిపై ఓ ప్రకటన చేశారు. ఇండిపెండెంట్ నామినేషన్ కింద 12th ఫెయిల్ సినిమాను ఆస్కార్స్‌కు పంపించినట్లు స్పష్టం చేశారు. మేటి డైరెక్టర్ విదు వినోద్ చోప్రా.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విక్రాంత్ మాసే ఈ ఫిల్మ్‌లో కీలక పాత్ర పోషించాడు. టీవీ రంగంలో విక్రాంత్ కెరీర్ ప్రారంభమైంది. అతను డ్యాన్సర్ కూడా.
విదు వినోద్ చోప్రా తీసిన 12th ఫెయిల్ సినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజైంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఆ సినిమాను విడుదల చేశారు. మనోజ్ పాత్రలో విక్రాంత్ మాసే నటించారు. మేధా శంకర్ హీరోయిన్ పాత్రను పోషించారు. అనురాగ్ పాఠక్ రాసిన నవల ఆధారంగా 12th ఫెయిల్ సినిమాను తీశారు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోష్ జీవిత కథ ఆధారంగా ఫిల్మ్‌ను తెరకెక్కించారు.