కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. బీజేపీ ఎంపీ కుటుంబంలో విషాదం
Cable bridge | గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్‌కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్‌కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతిచెందారు. వారంతా తన సోదరి కుటుంబానికి చెందినవారని కుందరియా చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారన్నారు. మచ్చునదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 132 మంది మరణించగా, 117 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 19 మంది గాయపడ్డారు. మిగిలినవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గల్లంతైనవారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక సిబ్బంది రెస్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని ఎంపీ చెప్పారు. మచ్చు నదిలో మునిగిపోయినవారి మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

