12 మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు

ఢిల్లీ : ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్ముతున్న 12 మెడికల్ షాపుల లైసెన్సులను డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ రద్దు చేసింది. ఈ ఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొవిడ్ మేనేజ్మెంట్ డ్రగ్స్‌ను విక్రయించినందుకు 12 మెడికల్ షాపుల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు అమ్మినందుకు గత వారమే 25 మెడికల్ షాపుల లైసెన్స్‌లను రద్దు చేసిన అధికారులు మరో 12 దుకాణాలను షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సరైన సమాధానం రాని నేపథ్యంలో తాజాగా ఈ 12 దుకాణాల లైసెన్సులను రద్దు చేశారు.
దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. కొవిడ్ రోగులలో విచక్షణారహితంగా స్టెరాయిడ్ల వాడకాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. డ్రగ్స్ కంట్రోల్ విభాగం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి కస్టమర్లను మెడికల్ షాపులకు పంపుతోంది. ప్రిస్క్రిప్షన్ లేకుండానే దుకాణాదారులు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ అధిపతి అతుల్ కుమార్ నాసా తెలిపారు.
ఈ 12 మెడికల్ షాపులు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొవిడ్ చికిత్సలో వాడే స్టెరాయిడ్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ డ్రగ్స్‌ను అమ్మడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టానికి విరుద్ధం అని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

