Chhattisgarh | వివాహానికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబంలో 11 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బాలోద్ (Balod) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి కాంకేర్ జాతీయ రహదారిపై (Kanker National Highway) జగత్రా (Jagatra)వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో (Bolero) వాహనాన్ని ఢీకొట్టింది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బాలోద్ (Balod) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి కాంకేర్ జాతీయ రహదారిపై (Kanker National Highway) జగత్రా (Jagatra)వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో (Bolero) వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి బొలేరో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాయ్‌పూర్ దవాఖానకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు.
మృతులంతా ధామ్తరి (Dhamtari ) జిల్లాలోని సోరెమ్ భట్గావ్ గ్రామంలో నివాసముండే ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. వీరంతా కాంకేర్ జిల్లాలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు.

కాగా, ప్రమాద ఘటనపై సీఎం భూపేశ్బగేల్ (CM Bhupesh Baghel) ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రమాదంలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు.https://twitter.com/ANI_MP_CG_RJ/status/1653877146560126977?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

