Srinagar Flag : శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
Srinagar Flag : స్వాతంత్ర్య దినోత్సవం రోజున జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి 100 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న హరి ప్రభాత్ కొండపై ఈ జెండాను...

శ్రీనగర్ : స్వాతంత్ర్య దినోత్సవం రోజున జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి 100 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న హరి ప్రభాత్ కొండపై ఈ జెండాను (Srinagar Flag) ఏర్పాటుచేశారు. ఈ జెండాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆవిష్కరించారు. ఈ జెండా పొడవు 36 అడుగులు, వెడల్పు 24 అడుగులు. తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని భవనాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా వందనం తర్వాత కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిచారు. పంచాయతీ సభ్యులు తమ నియోజకవర్గాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నగరంలోని గల్లీగల్లీలో జెండాలు ఎగురవేశారు. ముఖ్యంగా దాల్ సరస్సు ప్రాంతం జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ పతాకం రంగులతో తీర్చిదిద్దారు.
ఆదివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరి పర్వతం కోట ప్రాకారాలపై ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తైన స్తంభంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జాతీయ జెండాను ఆవిష్కరించారు. డౌన్ టౌన్లో ఉన్న హరి పర్వతం… అద్భుతమైన చరిత్ర, నాగరికత, సంస్కృతిని కలిగి ఉన్నది. ఇది కశ్మీర్ హిందూ సంస్కృతి, భారతీయతకు చిహ్నంగా కూడా చెప్పుకుంటారు. హరి పర్వతంపై ఉన్న కోటను కో-ఈ-మారన్ కోట అని కూడా పిలుస్తుంటారు. దీనిని 1808 లో ఆఫ్ఘన్ గవర్నర్ అతా మహ్మద్ ఖాన్ నిర్మించారు. అంతకుముందు, ఈ ప్రాంతంలో మొఘల్ పాలకుడు అక్బర్ 1509 లో సైనిక కంటోన్మెంట్ నిర్మించాడు. మొఘల్ సైనికులు ఎక్కువగా వారి కంటోన్మెంట్లో నివసించేవారు. కశ్మీర్లో ఇస్లామిక్ ఆక్రమణదారుల పాలన, ఇస్లాం ప్రభావం పెరుగడంతో హరి పర్వతం పేరును కో-ఈ-మారన్ గా మార్చినట్లు చరిత్రకారులు చెప్తుంటారు.
మెరిసిన లాల్‌చౌక్..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను త్రివర్ణ రంగులతో అలంకరించారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు జెండా ఆవిష్కరణ కేవలం జిల్లా కేంద్రంలో, కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే జరిగేది. అయితే, ఈసారి స్వాతంత్ర్య దినోత్సవానికి చాలా ముందుగానే జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి ఆమేరకు ఏర్పాట్లు పూర్తిచేయడంతో అంగరంగ వైభవంగా సంబురాలు జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్, మొబైల్ సేవలు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ మార్గదర్శకాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

