మీషన్ భగీరథ నీళ్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం

సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం ఇంటింటికీ అందజేస్తున్న మీషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమని డీఎంహెచ్‌వో సాంబశివరావు, డీపీవో సాయిబాబ అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన రాపోలు భాస్కర్ అనే వ్యక్తికి గతంలో గ్రామంలో కిడ్నీ వ్యాధులు, ఫ్లోరిన్ సమస్య ఉందని కృష్ణ వాటర్ సఫ్లయ్ జరుగడం లేదని హెచ్ఆర్సీకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ అదేశాల మేరకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగి నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు.
ఈ సంధర్భంగా అధికారులు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మీషన్ భగీరథ వాటర్ సరఫరా కాకపోవడంతో ఫ్లోరిన్ నీళ్లు త్రాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికీ మీషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయని ప్రస్తుతం ఫ్లోరిన్ సమస్య పూర్తిగా తీరిందన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్యూఎస్ డీఈఈ దీన్‌దయాల్, ఎంపీడీవో యాదగిరి, సర్పంచ్ సామల భాస్కర్, ఏఈ అనుష, ఎంపీవో శశికళ, మండల వైద్యాధికారి రేష్మ, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

