నారాయణకు కొండా లక్మణ్ బాపూజీ పురస్కారం

చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కర్నాటి నారాయణకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో విభన్నమైన డిజన్‌తో మగ్గంపై నేసిన చీరకు ఈ పురస్కారం వరించింది.
ఈ అవార్డు సాధించాలనే పట్టుదలతో ప్రకృతి నుంచి లభించే గంధం చెక్క, దానిమ్మ బెల్లం, అంజిష్ట, ఇండిగో నీలం, మోదుగు, బంతిపూల ద్వారా రంగులను తయారు చేసి నూలు ధారానికి అద్దారు. దీనితో పోచంపల్లి డబుల్ ఇక్కత్ టెక్నిక్‌తో 30 మోటిఫ్ లు వచ్చేలా మగ్గంపై చీరెను నేశాడు. తన భార్య, ఇద్దరు కుమారులు, కూతరు సహకారంతో ఈ చీరెను తయారు చేశాడు.
6నెలలు వారంత కలిసి శ్రమించి దీనిని రూపొందించారు. ఒక వార్పులో నాలుగు చీరెలను తయారు చేయడానికి ఈ సమయం పట్టింది. ఈ డిజన్లను ఆమెరికా, సింగపూర్, ముంబాయి ప్రాంతాలకు అర్డర్లపై సైతం పంపించారు. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన నారాయణ చిన్నతనం నుంచి చేనేత పనిని అలవర్చుకున్నా డు. చదువుకునేప్పటి నుంచి సెలవు రోజుల్లో వృత్తిని చేసేవాడు. ఈ క్రమంలో 40 సంవత్సరాల నుంచి వృత్తినే నమ్ముకున్నాడు. అప్పటి నుంచి మగ్గంపై వస్ర్తాలు నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి రంగుల అద్దకంలో శిక్షణ పొందారు. ఈ తర్పీదుతో అప్పటి నుంచి పర్యావరణానికి హానీ కలిగించని రంగులతో చేనేత వస్ర్తాలను తయారు చేయాలని సంకల్పించారు. దీంతో తన ఆలోచనకు మరింత పదును పెట్టి ప్రకృతి రంగులతో నేత వస్త్రాలను తయారు చేస్తు ప్రత్యేకత చాటుకుంటున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

