‘జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి’
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండలాల జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు.
భువనగిరి అర్బన్, జూన్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండలాల జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం భువనగిరి పట్టణంలో వందన కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను పరిష్కరించి ఇడ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులకు సొంత ఇండ్లు లేక అద్దె ఇండల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ గృహ పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శులు నాగరాజు, కదిర్, భువనగిరి మండల కార్యదర్శి అల్తాఫ్, గుండాల అధ్యక్షుడు నరేష్, మోత్కూర్ అధ్యక్షుడు నర్సింహా, అడ్డగూడూర్ అధ్యక్షుడు సందీప్, తుర్కపల్లి కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

