భువనగిరి అర్బన్, జూన్ 15 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్తగా డాక్టర్ సూర్య శ్రీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పని చేసిన డాక్టర్ చిన్న నాయక్ బదిలీపై ఘట్కేసర్కు వెళ్లడంతో సూర్య శ్రీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.