చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని తిరుమలకుంట చెరువు సహజ అలుగు నీటి ప్రవాహాన్ని పైప్ లైన్ ద్వారా మళ్లించేందుకు ఆర్అండ్బీ శాఖ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని గ్రామ సర్పంచ్ కొలను వాణి కృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...
– కలెక్టర్ కార్యాలయంలో బ్రాహ్మణపల్లి సర్పంచ్ కొలను వాణి కృష్ణారెడ్డి వినతి
బీబీనగర్, అక్టోబరు 09 : బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని తిరుమలకుంట చెరువు సహజ అలుగు నీటి ప్రవాహాన్ని పైప్ లైన్ ద్వారా మళ్లించేందుకు ఆర్అండ్బీ శాఖ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని గ్రామ సర్పంచ్ కొలను వాణి కృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్లు 182, 183, 184 పరిధిలో 12.07 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తిరుమలకుంటకు రెండు అలుగులు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా వచ్చే నీరు సహజంగా పల్లపు ప్రాంతంలోని వ్యవసాయ భూముల మీదుగా బ్రాహ్మణపల్లి చెరువులోకి చేరుతుందని పేర్కొన్నారు. అయితే కుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి, అలుగు రాతి కట్టడాలను తొలగిస్తూ సహజ నీటి ప్రవాహాన్ని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రహదారికి సమాంతరంగా సుమారు 500 మీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నిర్మాణంతో చెరువు ఎఫ్టీఎల్ పరిధి, సహజ నీటి ప్రవాహం, రైతుల వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పైప్ లైన్ పనులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమగ్ర విచారణ జరిపి, పైప్‌లైన్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయడంతోపాటు తిరుమలకుంట సహజ అలుగు నీటి ప్రవాహాన్ని యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అందె యాదెయ్య, నాయకులు సురకంటి సుధాకర్‌రెడ్డి, పెరుమాండ్ల అమరేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

