నల్లగొండ : జిల్లాలోని కొండమల్లేపల్లి మండల పరిధిలోని పెండ్లిపాకల ( Pendli Pakala ) ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులు ( Victims ) తమ పరిహారం ( Compensation) కోసం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. 2013 జీవో ప్రకారం భూముల పరిహారం మంజూరైనా 9 ఏళ్లుగా డబ్బులు అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్–1 అధికారి లీల కాళ్లపై పడి వేడుకున్నారు. ముడుపులు చెల్లించనందుకే పరిహారం నిలిపివేశారని అధికారులపై ఆరోపణలు చేశారు.అధికారులు కనుకరించాలని కోరారు.రెడ్ పిటిషన్లు ఉండటంతోనే పరిహారం పెండింగ్లో ఉందని డిప్యూటీ కలెక్టర్ లీల వివరించారు.